చిన్న రీజన్ తో “జయం” సినిమాని మిస్ చేసుకున్న..ఆ అన్ లక్కి ఫెలో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణ . కారణమేదైనా కావచ్చు మనం చేయాల్సిన సినిమాను పక్క హీరో తీసి హిట్టు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేం అలాంటి బాధను ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ అందరూ అనుభవించారు . కానీ డెబ్యూ సినిమాతోనే అలాంటి బాధను అనుభవించిన హీరో గా అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ “గంగోత్రి” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత తన స్థాయిని ఏ రేంజ్ లో మార్చుకున్నాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని త్వరలోనే గ్లోబల్ స్థాయి క్రేజ్ దక్కించుకోవడానికి రెడీగా ఉన్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ ని మరో హీరో డెబ్యూ చేశాడు అన్న వార్త వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు నితిన్ . ఎస్ నితిన్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన “జయం” సినిమాను మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్ నేనట.

కానీ అప్పటికే అల్లు అరవింద్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఆ బాధ్యతలు అప్ప చెప్పాడని.. ఆ కారణంగానే తేజ ఇంటికి వచ్చి అడిగిన ఆఫర్ను ఇవ్వలేకపోయాడని అవుతుంది . ఏ మాటక ఆ మాట గంగోత్రి సినిమా కంటే జయం సినిమాకే ఎక్కువ క్రేజ్ లభించింది. అంతేకాదు జయం సినిమా తర్వాత నితిన్ రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు బాగా తెలిసిందే. గంగోత్రి సినిమా కన్నా కూడా జయం సినిమాతో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అల్లు ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు..!!