పేరుకే పాన్ ఇండియా హీరో.. కనీసం ఫోన్ పే చేయడం కూడా రాదు..ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ప్రజెంట్ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉయ్యాలలో ఊగే చంటి బిడ్డకు కూడా ఓ ఫోన్ ఆపరేట్ చేయడం తెలుసు. స్కూల్ కి వెళ్లే పిల్లాడికి ఫోన్లో ఏయాప్స్ ఉంటాయి .. ఫోన్ ఏ విధంగా వాడాలి అన్నది ఏ టు జెడ్ టోటల్ తెలిసిపోతుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరోకి ఇప్పటివరకు ఫోన్ పే చేయడం రాదు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఆ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని . ఎస్ ఈ విషయాన్ని స్వయాన ఆయనే చెప్పారు. దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ ..”ఆయనకి ఫోన్ పే వాడడం రాదని ..గూగుల్ పేలాంటివి అసలు తెలియని ఫోన్ ని ..అసలు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతానని చెప్పుకొచ్చారు”. అంతేకాదు బ్యాంకు కి సంబంధించిన విషయంలో ఆయన పూర్తిగా శూన్యం అంటూ చెప్పుకొచ్చారు .

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన వేవి ఆయనకు తెలియవట. అవన్నీ వాళ్ళ టీమే చూసుకుంటుందట. మరి ముఖ్యంగా అంజన లేనిదే నాని ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేరట. అది కూడా ఆయనకు తెలియదని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని నేచురల్ యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరో నానికి ఫోన్ పే గూగుల్ పే చేయడం తెలియదా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!