సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతున్న తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక రీమిక్స్ సినిమాను కూడా తెరకెక్కించలేదు . ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తూ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొని పలు రికార్డులను సైతం సృష్టించారు మహేష్ బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.
కొన్ని ఏరియాలలో తనదైన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్న మహేష్ బాబు ఓవర్సీస్ ఏరియాలో ఈ స్టార్ హీరో చిత్రాలకు మరింత ఆదరణ లభిస్తోంది .దీంతో అక్కడ సినిమాలకు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మహేష్ బాబు ఖాతాలో ఒక అరుదైన రికార్డు నెలకొనడం జరిగింది.. అదేమిటంటే ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు అలాంటిది అక్కడ ఏకంగా 11 సార్లు మహేష్ బాబు ఈ మార్కును చేరుకున్నాడట.
టాలీవుడ్ టాప్ హీరోగా ఉంటూ ఇలాంటి ఘనత అందుకున్న ఏకైక హీరోగా మహేష్ బాబు పేరు పొందారు. ఇక తర్వాత స్థానంలో నాని జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.. ఇండియా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అందరికంటే ఎక్కువసార్లు షారుఖ్ ఖాన్ మొదటి ప్లేస్ లో ఉన్నారు.. ఆ తర్వాత స్థానం అక్షయ్ కుమార్, మూడవ స్థానం సల్మాన్ ఖాన్, నాలుగవ స్థానంలో హృతిక్ రోషన్, ఐదవ స్థానంలో అమీర్ ఖాన్, ఆరవ స్థానంలో అజయ్ దేవగ వీరంతా టాప్ సిక్స్ వరకు పేరు సంపాదించారు. ఇండియా వ్యాప్తంగా అయితే మహేష్ బాబు ఏడవ స్థానంలో నిలిచారు.