పుష్ప -2 పై క్రేజీ న్యూస్.. రిలీజ్ డేట్ లో మార్పు..?

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది సుకుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పుష్ప-2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది .అల్లు అర్జున్ కు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించింది దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Pushpa 2: The Rule- Allu Arjun's first look, shooting in Odisha, Srivalli's  death & more

అదేమిటంటే పుష్ప-2 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు విడుదల సమయం మారినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి కంటే ముందే ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే అల్లు అర్జున్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.. పుష్ప-2 చిత్రానికి అన్ని కలిసి వస్తే ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక గతంలో పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలోనే విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే సీక్వెల్ ని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇందులో ఫహాద్ ఫాజీల్ అనసూయ సునీల్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఇటీవల ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకున్నట్లుగా కూడా తెలియజేశారు ఫహాద్ ఫాజీల్..