రష్మిక ను ఆ డైరెక్టర్ చీట్ చేసాడా..? నమ్మించి నిలువునా ముంచేసాడా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన … ఎలాంటి నిర్ణయం తీసుకున్న చాలా బోల్డ్ గా .. చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటుంది అన్న అభిప్రాయం జనాలందరికీ ఉంది . వాళ్ళ ఫాన్స్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు . “ఛలో” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక ఇంత చిన్న టైంలోనే.. అంత క్రేజీ ఆఫర్లను క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అంటుంటారు ఫ్యాన్స్ .

అయితే ఫస్ట్ టైం రష్మిక మందన స్టార్ట్ డైరెక్టర్ ని నమ్మి మోసపోయింది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే సుకుమార్ డైరెక్షన్లో బన్నీ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమా పుష్ప1. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగ రాసింది . ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు.. రష్మిక – బన్నీ – సుకుమార్ .

ఇలాంటి క్రమంలోనే సుకుమార్ పుష్ప2 లో భారీ మార్పులు చేయబోతున్నారట. ఈసారి శ్రీవల్లి పాత్రని సగానికి పైగానే కోత కోసి ఆమె పాత్రను సగంలోనే లేపేసే విధంగా క్యారెక్టర్ ను డిజైన్ చేసుకున్నారట . ఆమె ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ కూడా రాబోతుందట. ఆమె పాత్ర సినిమాలో డమ్మి కాబోతుంది అంటున్నారు మేకర్స్. పుష్ప 2 ద్వారా తనకు మరింత పాపులారిటీ దక్కుతుంది ..మరింత క్రేజ్ సంపాదించుకోవచ్చు అనుకున్న రష్మిక మందన మోసపోయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సుకుమార్ ని నమ్మితే ఇంత నిలువునా ముంచేస్తాడా..? అంటూ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే పుష్పవన్ లో టాప్ పొజిషన్ అందుకున్న శ్రీవల్లి పుష్ప2లో మాత్రం ఆ స్థానాన్ని దక్కించుకోకపోతే కచ్చితంగా రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ ప్రముఖులు..!!

 

Share post:

Latest