`ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ కాశ్మీర్ లో జరుగుతున్న జీ20 సదస్సుకు ఇండియన్ సినిమా పరిశ్రమ ప్రతినిధిగా హాజరయ్యారు.
ఈ సదస్సులో చరణ్ తన అదిరిపోయే స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న అందమైర లోకేషన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఈ సదస్సు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఇండియాలోని కేరళ, కాశ్మీర్.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి సుందరంగా ఉంటుంది. ఇండియాలోని అందాలను ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నా.
అందుకే ఇకపై నేను నటించబోయే చిత్రాల షూటింగ్ ఎక్కువ శాతం ఇండియాలోనే జరిగేలా చూసుకుంటాను. కేవలం లొకేషన్స్ కోసం ఇతర దేశాలకు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఒకవేళ హాలీవుడ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చినా.. ఆ దర్శకులను షూటింగ్ కోసం ఇక్కడకు రావాలని కండీషన్ పెడతాను. అందుకు ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తాను` అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.