దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా `దేవర` సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలరించబోతోంది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులకు కమిట్ అయిన జాన్వీ కపూర్.. తాజాగా అనుకోకుండా ట్రోలర్స్ బారిన పడింది. హోటల్ నుంచి జాన్వీ కపూర్ పిల్లో దొంగతనం చేసిందంటూ పలువరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
పిల్లో దొంగతనమా.. స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇదేం బుద్ధి రా బాబు అనుకుంటున్నారా.. అసలేం జరిగిందంటే మే 22వ తేదీన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడింది. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ డ్రెస్ లో అందంగా దర్శనమిచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె ఓ తెల్లటి దిండును మోస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడతంతో.. నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. హోటల్ నుంచి జాన్వీ పిల్లోను కొట్టేసిందని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఇంకొందరు జాన్వీ ఫ్లైట్ లో వెళ్తుందా లేక ట్రైన్ లో వెళ్తుందా అని ఎగతాళి చేయడం ప్రారంభించారు.