సోషల్ మీడియాలో యాంకర్ సుమపై ట్రోలింగ్.. ఇందుకే!

తెలుగు బుల్లితెర యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. అవును, యాంకర్ సుమ అంటే ఓ బ్రాండ్ మాదిరి. టాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా వేడుక జరగాలన్నా సుమ వుంది తీరాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు, దర్శక నిర్మాతలు ఆమెనే లీడ్ యాంకర్ గా కావాలని పట్టుబట్టి మరీ షోస్ చేయాలని అనుకుంటారు. బేసిగ్గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర మాత్రమే కాకుండా ఆమె కొన్ని సినిమాలలో కూడా నటించింది.

ఇక ఇక్కడకి ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమను మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేకపోయారు. ఈ క్రమంలో దాదాపు 2 దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుంది సుమ. ఇదిలా ఉండగా.. సమయం దొరికినప్పుడల్లా.. తన భర్తతో కనిపిస్తూ అలాంటి ప్రచారాలు జరగకుండా చూసుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళు.. ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసిన విషయం తెలిసినదే.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఎంతవరకు ఆమె ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. ఈ యాడ్ ఆమె జీవితానికి ఓ మచ్చని తెచ్చింది. విషయం ఏమంటే, ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు. సుమ కరోనా టైం నుండి ఆ సంస్థ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉంది. విషయం పూర్తిగా తెలియదు కానీ, ఆ ప్రొడక్ట్స్ మంచివి కాదని, డెలివరీ చేసే లోపే పాడైపోతున్నాయని, ప్యాకింగ్ అయితే చాలా హారిబుల్ గా ఉందని నెటిజన్లు ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బు కోసం అలాంటి యాడ్స్ ప్రమోట్ చేయొద్దని నెటిజన్లు ఆమెకి సలహాలు ఇస్తున్నారు.

Share post:

Latest