బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి శెట్టి.. `క‌స్ట‌డీ` ఫ్లాప్ అయినా బేబ‌మ్మ‌కు బాగానే క‌లిసొచ్చింది!!

టాలీవుడ్ బేబ‌మ్మ‌ కృతి శెట్టి గ‌త కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో స‌తమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్ట‌డీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు.

ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే క‌స్ట‌డీ ఫ్లాప్ అయినా కృతి శెట్టికి మాత్రం బాగానే కలిసి వచ్చింది. తాజాగా స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్‌ విజయ్ ద‌ళ‌ప‌తితో ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంద‌ట‌. క‌స్ట‌డీ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజ‌య్ తో చేయ‌బోతున్నాడు.

విజ‌య్ కెరీర్ లో 68వ ప్రాజెక్ట్ ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. అయితే ఒక హీరోయిన్ గా కృతి శెట్టిని వెంక‌ట్ ప్ర‌భు ఎంపిక చేశాడ‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ల‌రోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌స్తుంద‌ని అంటున్నారు. ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై కళపతి ఎస్‌. అఘోరం నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

Share post:

Latest