నా దేవుడు చిరంజీవే అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన సీనియర్ నటుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి సహాయం చేయాలన్న ముందు వరుసలో ఉంటారు.. ముఖ్యంగా ఆయనకు అవసరం ఉన్నవారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా బయట చెప్పుకోరు.. కేవలం చిరంజీవి సహాయం పొందిన వారు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. అలా గతంలో తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు పొన్నంబలం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ నటుడు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలియజేయడం జరిగింది.

పొన్నం బలం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి లక్ష రూపాయలు సహాయం చేశారు..ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం దాదాపుగా రూ .40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితమే ఈయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం జరిగింది.. తాజాగా మరొకసారి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి చేసిన సహాయం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలు కొంతమంది డయాలసిస్ కోసం మాత్రమే సహాయం చేశారని చికిత్సకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు.

ఒకరోజు తన అల్లుడు తనని ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లాడని తెలిపారు. అక్కడ పూజ అనంతరం పూజారి చిరంజీవ చిరంజీవ అన్నారని.. ఆ సమయంలోనే తనకు చిరంజీవి గారి పేరు గుర్తుకు వచ్చిందని తెలిపారు. చిరంజీవిని అడిగితే ఒక రెండు లక్షల రూపాయల వరకు సహాయం చేస్తారని భావించి తన మిత్రుడు ద్వారా చిరంజీవి నెంబర్ అడిగి తీసుకొని ఫోన్ చేశానని తెలిపారు. చిరంజీవి సహాయం చేయడానికి ముందుకు వచ్చారని రెండు లక్షలు ఇస్తారనుకుంటే ఏకంగా రూ .40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోనని నాకు దేవుడు అంటూ తెలిపారు పొన్నం బలం.

Share post:

Latest