పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి.. ఈ షో వల్ల ఊహించని విధంగా కమెడియన్లు పాపులారిటీ సంపాదించారు.అలాంటి వారిలో కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకరు.. ప్రవీణ్ – ఫైమా ప్రేమలో ఉన్నట్లుగా గతంలో ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.. వీరిద్దరి ప్రేమ గురించి ఎన్నో రకాలుగా వార్తలైతే వినిపించాయి. పైగా బిగ్ బాస్ షో కి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ ,పైమా మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Jabardath Comedian Komaram Youtube Channel Marriage Video Goes Viral

బిగ్ బాస్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ఫైమా బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇతర చానల్స్ లో పాల్గొనడానికి అవకాశం లేదని సమాచారం. అయితే పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ప్రవీణ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పరిచయం లేని అమ్మాయితో తన పెళ్లి జరిగినట్టు వీడియోను షేర్ చేసుకున్నారు…

ఈ వీడియోలో జబర్దస్త్ కొమరంతో పాటు మరికొంతమంది హాజరైనట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్లు ఏదో టీవీ షో కోసమే ప్రవీణ్ ఇలా చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఇది ప్రవీణ్ ఇంటి దగ్గరే జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరి ఫైమా పరిస్థితి ఏమిటి అంటూ కూడా పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest