ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు హృతిక్ రోషన్ చేసిన పని చూశారా… ఇది కాద ఫ్రెండ్‌షిప్ అంటే..!

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.

NTR 30 is Devara: From Cast to Release Date, All You Need to Know About Jr  NTR, Janhvi Kapoor and Saif Ali Khan's Upcoming Telugu Film | 🎥 LatestLY

అంతేకాకుండా ఎన్టీఆర్ బాలీవుడ్లో నటించబోయే వార్ 2 సినిమా గురించి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్- హృతిక్ రోషన్తో కలిసి నటించబోతున్నాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ బాలీవుడ్ హీరో యంగ్ టైగర్ కు విషెస్ చెప్పడంతో పాటు.. నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నానంటూ ఇండైరెక్ట్ గా ‘వార్ 2’ సినిమాపై అప్డేట్ ఇచ్చేశాడు. ఇక ఈ ట్వీట్ చివర్లో తెలుగులో ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు.

‘హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంతోషకరమైన రోజుని నువ్వు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంత వరకు నీ ప్రతిరోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ఒక్క ట్వీట్ తో వీళ్లిద్దరు కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నారని మరోసారి కన్ఫమ్ అయ్యింది. ఈ ట్వీట్ చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇది కదా అసలైన బర్త్ డే అప్డేట్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.