సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతోంది. అలాగే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ పోతోంది.
అయితే కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న సమంత.. తాజాగా పెళ్లిళ్ల బ్రోకర్ గా మరింది. ఈ మేరకు తాజాగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జ్యూవెల్ గమాడియాకు సూట్ అయ్యే అమ్మాయి కావాలంటూ సమంత తన పోస్ట్ లో పేర్కొంది. జ్యూవెల్ ఫొటో షేర్ చేసిన సమంత.. `డాక్యర్ జ్యూవెల్ గమాడియాకు సరైన మ్యాచ్ కోసం వెతుకుతున్నాను. అతను బయటకు కనిపించే దానికంటే చాలా తెలివైన వాడు. ఇందుకు నేను హామీ ఇస్తున్నాను` అని రాసుకొచ్చింది.
దీంతో సమంత పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అయితే ఎవరీ జ్యూవెల్ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇతగాడు బాలీవుడ్ ప్రముఖులకు డాక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అజయ్ దేవగన్ ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఏ చిన్న సమస్య వచ్చినా జ్యూవెల్ దగ్గరే చికిత్స పొందుతారు. తాజాగా ఈ జాబితాలో సమంత కూడా చేరింది. ఈ క్రమంలోనే అతడితో మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఆ సన్నిహిత్యంతోనే సమంత తాజాగా పోస్ట్ పెట్టిందని అంటున్నారు.