NTR 30లో ఆ ఫ్లాప్ హీరోయిన్‌.. కొర‌టాల ప్లాన్ ఏంట్రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.

NTR 30: Jr NTR and Koratala Siva's film announced ahead of the actor's  birthday. See motion poster

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు ప్రతి నాయకుడుగా నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వ‌స్తోన్న‌ ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఎగ్జిట్ చేస్తూనే ఉంది. చాలా టైం తీసుకుని మరి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి కొన్ని వారాల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుక‌గా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యుస్ కూడా రాబోతుంది.

NTR 30: Janhvi Kapoor Expresses Her Excitement On Working With Jr NTR, Says  'I Manifested It'

ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఎంతో డిఫరెంట్‌గా కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందని తెలుస్తుంది. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు అనన్య పాండే. ఈ సినిమాలో అన‌న‌య్య రెండో హీరోయిన్‌గా ఎన్టీఆర్‌కు జంటగా నటించే అవకాశం ఉందట‌.

NTR 30: Ananya Panday to Play the Female Lead in Jr NTR Next With Koratala  Siva? - Sakshi

అన‌న్య ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా లైగ‌ర్ సినిమా చేస్తే పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫ్లాప్ హీరోయిన్ ఎన్టీఆర్ సినిమాలో ఏంటా అని యంగ్ టైగ‌ర్ అభిమానులో కొత్త అనుమానాలు వ‌స్తున్నాయి. అస‌లు కొర‌టాల ప్లాన్లు, ఐడియాలు ఎవ్వ‌రికి అర్థం కావ‌ట్లేదు.