తెలుగులో ‘ బిచ్చ‌గాడు 2 ‘ కు భారీ టార్గెట్‌… బిచ్చ‌గాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందా..!

కోలీవుడ్ విలక్షణ నటుడు కమ్‌ దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ కలెక్షన్ సాధించిన సినిమా కూడా ఇదే. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన బిచ్చగాడు సినిమాకి మంచి ఆదరణ లభించింది.

Bichagadu 2" 4-minute teaser creates curiosity about the film

మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియ కృష్ణస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు 2 సినిమాకి విజయ్ ఆంటోని కథ అందించడం, అలాగే నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించడం మరో విశేషం. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బిచ్చగాడు 2' మూవీ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

మే 19న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే బిచ్చగాడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ కి సీక్వ‌ల్‌గా వస్తున్న బిచ్చగాడు2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరిగింది. బిచ్చగాడు2 మూవీ తెలుగులో రూ.6 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. బిచ్చగాడు పార్ట్ 1 తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

బిచ్చగాడు 2' నుండి బికిలి సాంగ్ రిలీజ్ - idhatri

బిచ్చగాడు మూవీని చదలవాడ కృష్ణమూర్తి రూ.2 కోట్లకు కొని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏకంగా రూ.14.8 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో బిచ్చగాడు 2 మూవీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కచ్చితంగా ఈ మూవీకి సూపర్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు మేకర్స్.

Share post:

Latest