సాయి ప‌ల్ల‌వి మాములుది కాదుగా .. 7వ త‌ర‌గ‌తిలో అంత ప‌ని చేసిందిగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హైబ్రిడ్ పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు తన నటించిన సినిమాలలో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అలాంటి సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

Unknown Facts About Sai Pallavi: From Inclusion In Forbes To Rejecting  Fairness Ad Worth Rs 2

పెళ్లి ఎప్పుడు ? అన్న ప్ర‌శ్న‌కు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి- ప్రేమ అంటే తనకు ఇష్టం లేదని.. అలా అని ఆ బంధాన్ని ఎప్పుడు గౌరవిస్తానని.. అలాగే ప్రేమ పెళ్లి అయితే మన జీవితం బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇక దీంతో సాయి ప‌ల్లవిలో చాల విష‌యం ఉంది అంటూ అభిమ‌నులు అనుకుంటున్నారు. రిసెంట్‌గా ఈ హైబ్రిడ్ పిల్ల ప్రేమ‌లో ప‌డ‌లేదు కానీ చిన్న‌త‌నంలోనే ఓ కుర్నాడిని ఎంతో సీరియ‌స్‌గా ల‌వ్ చేసిందిట.

Sai Pallavi Family Photos | Actress Sai Pallavi Father, Mother, Sister and  Friends Photos - YouTube

ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది, ఏడవ తరగతిలో ఉన్నప్పుడే తన క్లాస్ మేట్ కుర్రాడికి పడిపోయిందిట. తొలి చూపులోనే అభిమానం..ఆ తర్వాత ప్రేమ పుట్టింద‌ట‌. ఆ విష‌యం అబ్బాయితో చెప్ప‌లేక ఒకరోజు ప్రేమలేఖ రాసిందిట‌. కానీ, అది అతనికి ఎలా ఇవ్వాలో తెలియక పుస్తకంలో దాచి పెట్టుకుంద‌ట‌. అనుకోకుండా ఆ లెటర్ సాయి ప‌ల్ల‌వి అమ్మ కంట పడింది.

saipallavi

దాంతో చెప్పలేనంత కోపం వచ్చి ఆమెను చితక్కొట్టేసిందిట‌. అమ్మ కొట్టడం అదే మొదలూ, చివరా. ఇప్పటి వరకూ మళ్లీ తనకి కోపం తెప్పించే పనులు చేయలేదట‌. అలా సాయి ప‌ల్ల‌వి సినిమాలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా మ‌రింది.

Share post:

Latest