అలాంటి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. రివీల్ చేసిన తల్లి..

ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు సాధారణ మనిషి కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతుడా అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తారలు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిన వారే మనకు తారసపడతారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యుక్తవయసులో టీబీ తో బాధపడ్డానని లివర్ సంబంధించిన సమస్యలు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కూడా క్యాన్సర్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఎంతోమంది హీరోలు చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు అసాధారణమైన ఫాలైన సంపాదించుకున్న ఈయనకి కూడా ఒక సమస్య ఉండేదట. అయితే ఆ విషయాన్ని ఆయన తల్లి అంజనాదేవి స్వయంగా ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. కళ్యాణ్ బాబుని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది.. ఎండనకా.. వాననకకా..తిరుగుతూ ఉంటాడు. ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోడు చిన్నప్పుడు కళ్యాణ్ బాబుకి ఆస్తమా ఉండేది. అందువల్ల జాగ్రత్తగా చూసుకునే దాన్ని అంటూ ఆమె తెలిపారు.

ఇకపోతే ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి సహాయం చేయమని భగవంతుడు వాడికి పని పెట్టాడు.. వాడు తప్పకుండా విజయం సాధిస్తాడు అనే నమ్మకం నాకు ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశారు అంజనా దేవి గారు.

Share post:

Latest