దెబ్బ మీద దెబ్బ‌.. కెరీర్ ను నిల‌బెట్టుకునేందుకు కృతి శెట్టి సంచ‌ల‌న నిర్ణ‌యం!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ‌.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగర్, బంగార్రాజు రూపంలో మరో రెండు హిట్స్ పడడంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు.

కానీ అప్పుడే అసలు కథ‌ మొదలైంది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం కృతి శెట్టికి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. ఈమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడ్డాయి. ఇక రీసెంట్ గా కృతి శెట్టి కస్టడీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. నాగ చైత‌న్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాల‌ను అందుకోలేకపోయింది.

దీంతో కృతి శెట్టి ఖాతాలో మ‌రో ఫ్లాప్‌ పడింది. అయితే ఇలా వరుస పరాజయాలు ఎదురవడంతో కృతి శెట్టి కెరీర్ డేంజ‌ర్ జోన్‌లో పడింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుందట. కెరీర్ ను నిలబెట్టుకునేందుకు తన రెమ్యున‌రేష‌న్‌ లో స‌గం కోత వేసుకుందట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు కోట్ల రేంజ్ లో తీసుకుంటున్న కృతి.. ఇప్పుడు కోటి రూపాయలకే సినిమా చేస్తానని చెబుతుందట. అలాగే సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు మరియు స్కిన్ షో చేసేందుకు ఎలాంటి కండిషన్స్ పెట్టనని అంటుంద‌ట‌. గ్లామర్ హీరోయిన్ గా మారి స‌క్సెస్ అవ్వాల‌ని కృతి శెట్టి డిసైడ్ అయింద‌ట‌.

Share post:

Latest