మెగా ఫ్యాన్స్ చిత‌క‌బాదిన సునిశిత్ అంత మేధావా.. మ‌రెందుకిలా మారాడు?

సినీ తార‌ల గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతూ శాక్రిఫైజింగ్ స్టార్ గా పాపుల‌ర్ అయిన సునిశిత్ ను తాజాగా మెగా ఫ్యాన్స్ చిత‌క‌బాదిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో సునిశిత్‌.. మెగా కోడ‌లు ఉపాస‌న‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఉపాస‌న‌తో గోవాకు లాంగ్ డ్రైవ్ వెళ్లాన‌ని.. రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు ఫ్రెండ్ అని సునిశిత్ చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఉపాస‌న‌ను పడేయ‌మ‌ని రామ్ చ‌ర‌ణ్‌ త‌న‌కు స్వ‌యంగా చెప్పాడంటూ సునిశిత్ మాట్లాడాడు. ఇత‌డి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో.. మెగా ఫ్యాన్స్ కి ఒళ్లు మండిపోయింది. వెంటినే సునిశిత్ ను వెతికి ప‌ట్టుకుని చిత‌క్కొట్టేశారు. అనంత‌రం అత‌డి చేత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌తో పాటు మెగా ఫ్యామిలీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పించాడు.

అయితే మెగా ఫ్యాన్స్ దేహశుద్ధి సునిశిత్ మామూలోడు కాదు. అత‌డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకైపోతారు. నిజానికి సునిశిత్ ఉన్న‌త చ‌దువును అభ్య‌సించాడు. వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ నందు బీటెక్ పూర్తి చేసిన సునిశిత్‌.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ విభాగంలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన మేధావి. . ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులలో మూడు పేపర్స్ ప్రెజెంట్ చేశాడు. అలాంటి పుస్తకాల పురుగు అయిన సునిశిత్ కు ప్ర‌స్తుతం మానసిక అనారోగ్యం స‌రిగ్గా లేద‌ట‌. అందుకే అత‌డు ఇలా మారిపోయాడ‌ని.. మానసిక స్థితి సరిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని స‌మాచారం.

Share post:

Latest