ఆ హీరోయిన్ కి మాట ఇచ్చేసిన త్రివిక్రమ్.. తప్పదు ఇక భరించాల్సిందేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భీమ్లా నాయక్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన సంయుక్త మొదటి సినిమాతోనే సూపర్ యాక్టర్స్ గా పేరు సంపాదించుకుంది . నటన టాలెంట్లో మంచి స్కిల్స్ ఉన్నాయి అంటూ జనాలు చేత ఓ ముద్ర వేయించుకుంది. అంతే కాదు భీమ్లా నాయక్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డైలాగులు చెప్పి అభిమానులను ఫిదా చేసింది .

ఆ తర్వాత సంయుక్త పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బింబిసారా, సార్ ,విరుపాక్ష సినిమాలతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది అయిపోగానే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ తో తో సినిమా చేయబోతున్నారట . ఆ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తనే సెలెక్ట్ చేశారట. ఇప్పటికే దానికి సంబంధించి ఆయన ఆమెకు ఒక మాట కూడా ఇచ్చేసారట . దీంతో ఈ ంతూస్ వైరల్ గా మారింది. కొందరు జనాలు తప్పదా మళ్ళీ నీ డైరెక్షన్లో ఆమెను భరించాల్సిందేనా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు . దీంతో సం యుక్తా-త్రివిక్రమ్ పేర్లు వైరల్ గా మారాయి..!!