తండ్రికొడుకులు మరో క్రేజీ రికార్డ్.. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇలా.. మెగా ఫ్యాన్స్ కి నిజంగా పండగే ఇది..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దీని అంతటికి కారణం మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా .. తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు.

కాగా ఆయన పేరు చెప్పుకొని వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్నారు. కాగా రీసెంట్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు ఎంపిక అవ్వడం మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ హీరోలు.. రీసెంట్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో చిరు-చరణ్ సెలక్ట్ అవ్వడం హైలెట్ గా మారింది.

ప్రముఖ ఇంటర్నేషనల్ ఆసియన్ హల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్ లో మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ ఎంపికయ్యారు.ఇందులో అనేక మంది సినీ ప్రముఖులను నామినీస్ గా ఎంపిక చేయగా.. అందులో విజనరీ లీడర్స్ జాబితాలో చిరు, చెర్రీ ఎంపికయ్యారు. దక్షిణాది నుంచి ఎంపికయిన స్టార్స్ వీరిద్దరు మాత్రమే కావడం విశేషం. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..!!

Share post:

Latest