త‌న‌కు పుట్ట‌బోయేది ఎవ‌రో చెప్పేసిన ఇలియానా.. ఇంత‌కీ అమ్మాయా? లేక అబ్బాయా?

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రిత‌మే ఇలియానా త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని ఆఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. మొద‌ట ఇదంతా త‌న‌ సినిమా కోసం ఆమె చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అని అంద‌రూ అనుకున్నారు. కానీ, త‌న ప్రెగ్నెన్సీ నిజ‌మే అని క‌న్ఫార్మ్ చేస్తూ బేబీ బంప్ తో ఇలియానా ద‌ర్శ‌న‌మిచ్చింది.

దాంతో ఇలియానా అనేక విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్నావా..? బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు..? అంటూ నెటిజ‌న్లు ఇలియానాపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కానీ, ఇవేమీ ప‌ట్టించుకోకుండా ఇలియానా త‌న ప్రెగ్నెన్సీ జ‌ర్నీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా త‌న‌కు పుట్ట‌బోయేది ఎవ‌రో కూడా చెప్పేసింది.

 

ప్ర‌స్తుతం ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన ఇలియానా త్వ‌ర‌లోనే పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌న‌వ్వ‌బోతోంద‌ని అంటున్నారు. సోష‌ల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటే ఇలియానా.. తాజాగా మిర్ర‌ర్ ముందు నిల‌బ‌డి బేబీ బంప్ ను చూపిస్తూ సెల్ఫీలు దిగింది. ఈ పిక్స్ ను సోష‌ల్ మీడియాలో ద్వారా పంచుకున్న ఆమె.. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంజెల్స్‌` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. అంటే త‌న‌కు పుట్ట‌బోయేది అమ్మాయే అని ఇలియానా ప‌రోక్షంగా హింట్ ఇచ్చేసింది. కానీ, ఇంత‌వ‌ర‌కు త‌న బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు అన్న‌ది మాత్రం ఇలియానా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌న్నార్హం.

Share post:

Latest