నిహారిక‌తో విడాకులు క‌న్ఫార్మ్ చేసిన చైత‌న్య‌.. మెగా ఫ్యాన్స్ ల‌బోదిబో!?

మెగా డాట‌ర్ నిహారిక, ఆమె భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 2020 డిసెంబ‌ర్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే పెళ్లి జ‌రిగి మూడేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని.. అవి చివ‌ర‌కు విడాకుల వ‌ర‌కు వెళ్లాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరిస్తూ నిహారిక‌, చైత‌న్య‌.. సోష‌ల్ మీడియా అకౌంట్స్ లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోల‌తో పాటు క‌లిసి దిగిన పిక్స్ ను తొలగించారు. ఇక ఇద్ద‌రూ జంట‌గా క‌నిపించి కూడా చాలా నెల‌లు అయిపోతోంది. నిహారిక ప్ర‌స్తుతం త‌న పూర్తి ఫోక‌స్ ను కెరీర్ పైనే పెట్టింది. నిర్మాత‌గా, న‌టిగా రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ ప‌రిణామాల‌న్నీ నిహారిక, చైత‌న్య దాంప‌త్య జీవితంపై అనేక అనుమానాలను పెంచేశాయి. ఇక తాజాగా చైత‌న్య నిహారిక‌తో విడాకులు దాదాపు క‌న్ఫార్మ్ చేసేశాడు. చైతన్య ఫ్యామిలీతో క‌లిసి తిరుమల వెళ్లారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకుని తిరిగి వ‌స్తుండ‌గా.. అక్కడ మీడియా కంట పడడంతో ఆయన ఫోటోలు తీశారు. అయితే వీరిలో నిహార‌క క‌నిపించ‌లేదు. చైత‌న్య త‌న త‌ల్లిదండ్రుల‌తో మాత్ర‌మే తిరుమ‌ల‌కు వ‌చ్చింది. దీంతో నిహారిక చైత‌న్య‌కు దూరంగా ఉంటుంద‌ని దాదాపు క‌న్ఫార్మ్ అయిపోవ‌డంతో.. మెగా ఫ్యాన్స్ ల‌బోదిబోమంటున్నారు.

Share post:

Latest