సరికొత్త గా హీడింబ ట్రైలర్.. సక్సెస్ పక్క..!!

టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ గా పేరుపొందిన ఓంకార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తమ్ముడు అశ్విన్ బాబు కూడా సుపరిచితమే.. హీరోగా జత కలిసే, రాజు గారి గది సిరీస్ వంటి చిత్రాలను నటించి బాగానే ఆకట్టుకున్నారు. తాజాగా హీరోగా నటిస్తున్న హిడింబ అనే చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు టీజర్లు సైతం ఇప్పటివరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

హిడింబ ట్రైలర్ ని మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 1908 బ్రిటిష్ కాలంలో నర మాంసభక్షకులు ఉండే ఒక దీపానికి ఖైదీలను తీసుకువెళ్లి అక్కడ వదిలేసిన విజువల్ తో ట్రైలర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అశ్విన్ బాబు నందిత శ్వేత నటించడం జరిగింది .

ముఖ్యంగా ఈ చిత్రంలో నాలుగు కొమ్ముల ఉన్న మాస్క్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మాస్క్ వేసుకొని కిడ్నాప్లు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు దీపంలోని నర మాంసభక్షకులు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎవరు వాటి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయంపై ఈ సినిమా అని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని డైలాగులు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది ఈ సినిమాతో కచ్చితంగా అశ్విన్ బాబు సక్సెస్ మరొకసారి అయ్యేలా కనిపిస్తున్నారు.<
/p>

Share post:

Latest