హాలీవుడ్ హీరోతో స‌మంత ప్రేమాయ‌ణం.. సైలెంట్ గా ఉంటూనే బిగ్ షాక్ ఇచ్చిందిగా!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. పెళ్లి జ‌రిగి విడాకులు అయినా స‌రే స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే విడాకుల త‌ర్వాత స‌మంకు మ‌రిన్ని ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా `ఖుషి` అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. రాజ్ & డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే స‌మంత హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. సైలెంట్ గా ఉంటూనే ఓ ఇంగ్లీష్ మూవీకి సైన్ చేసి తోటి హీరోయిన్లుకు బిగ్ షాక్ ఇచ్చింది.

`చెన్నై స్టోరీ` అనే హాలీవుడ్ మూవీలో స‌మంత హీరోయిన్ గా న‌టించ‌బోతోంది. ఇందులో హాలీవుడ్ న‌టుడు వివేక్ క‌ల్రా హీరో కాగా.. ఫిలిప్ జాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అట‌. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ క‌ల్రా, చెన్నైకి చెందిన అమ్మాయిగా స‌మంత క‌నిపిస్తార‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం నేప‌థ్యంలోనే సినిమా క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

Share post:

Latest