బోల్డ్ కామెంట్స్ చేస్తున్న ఆ యాంకర్!

నేడు సోషల్ మీడియాలు అనేవి ప్రచార మాధ్యమాలుగా తయారయ్యాయి. ఇక్కడ సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు ఎంతోమంది తమ ఉనికిని చాటుకుంటూ వుంటారు. ఈ క్రమంలో చాలామంది తెలుగు భామలు ఇక్కడ తమ అందాలను ప్రదర్శిస్తూ, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు.అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ‘మంజూష రాంపల్లి’ ఒకరు. ఆమె తెలుగు చిత్రసీమలోకి వచ్చి దశాబ్ద కాలం అయినప్పటికీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో తన హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నేనున్నానంటూ ఘాటైన అందాల కనువిందుని జనాలకు అందిస్తూ యమ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ‘నువ్వు హీరోయిన్ మెటీరియల్, ఇలా యాంకరింగ్ ఎన్నాళ్ళు చేస్తావు చెప్పు?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘నువ్వు అన్నం తింటున్నావా? అందం తింటున్నావా మంజూ.. చాలా సెక్సీగా ఉన్నావు’ అని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే, తెలుగులో ఉన్న క్రేజీ యాంకర్లలో మంజూష రాంపల్లి ఒకరు. మొదట్లో మోడల్‌గా ఫేమస్ అయినా మంజు తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఆరంభంలోనే ఎన్టీఆర్ చెల్లిగా కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’లో నటించే అవకాశం అందిపుచ్చుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష తనదైన నటనతో పాత్రలో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరుతో పాటు ప్రశంసలు, అవార్డులు కూడా లభించాయి. ఆ తర్వాత ఎందుకనో ఆమె సినిమాల పరంగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి ప్రస్తుతం ఫుల్ టైం యాంకర్ గా దూసుకెళ్తోంది.

Share post:

Latest