నా కన్న తండ్రి నాకి బద్ధ శత్రువు.. వనిత విజయ్ కుమార్ హాట్ కామెంట్స్..!!

సినీ సెలబ్రిటీగా పేరుపొందిన నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా ఈమె మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నరేష్ మూడో భార్యగా వనిత విజయ్ కుమార్ నటించింది. నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం పంచుకుంది.

Actress Vanitha alleges assault after property spat with dad
వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ తను మొదట్లో కొన్ని సినిమాలు చేసి మానేశాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అందులోకి వెళ్లి గెలిచాక తిరిగి స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చాను తమిళంలో పలు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం రాలేదని తెలిపింది.. కానీ ఒకరోజు గుడికి వెళ్లి ఒక తెలుగులో మంచి సినిమా కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేసింది. ఆ తర్వాత రోజే డైరెక్టర్ ఎంఎస్ రాజు తనకి ఫోన్ చేసి మళ్లీ పెళ్లి అనే సినిమా ఆఫర్ ఇచ్చాడని వెంటనే అందుకు ఓకే చెప్పానని తెలిపింది వనిత విజయ్ కుమార్.

షూటింగ్ సమయంలోనే తన ఫ్రెండ్స్ తన పిల్లలని చూసుకుంటున్నారని తన కుటుంబానికి నేను ఎప్పుడో దూరం అయ్యానని.. బయట వాళ్ళు వచ్చి ఇంట్లో ఏవేవో చేసేయాలని చూసేవారు.. అక్కడి నుంచి అసలు సమస్య మొదలయ్యిందని తెలిపింది.. అంతేకాకుండా తన సొంత కొడుకుకి బ్రెయిన్ వాష్ చేసి మార్చేశారని దీంతో తన తండ్రి కూడా అదే నమ్మి వాడిని తన నుంచి కాపాడుకోవాలని దూరం పెట్టారని తెలిపింది వనిత విజయ్ కుమార్. తన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన తనే గెలిచానని తెలిపింది.పోలీసుల సహాయం తీసుకుని తన తండ్రి ఇంట్లో నుంచి తనని గెంటేసారని అసలు ఈ తమిళనాడులోని అడుగు పెట్టవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇక తన తల్లి చివరిగా చనిపోయేటప్పుడు ఫోన్ చేసి రమ్మనగానే వెళ్లానని తెలిపింది. ఇక తన తల్లి చనిపోయిన తర్వాత తనని చాలా తిప్పలు పెట్టారని తెలిపింది వనిత విజయ్ కుమార్.

Share post:

Latest