మహానటి సినిమాలో చూపించినవన్నీ అబద్ధాలే : జెమినీ గణేష్ కూతురు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించింది. కీర్తి సురేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ మహానటి సినిమా అన్నిటికంటే ప్రత్యేకమైనది. అయితే మహానటి సినిమాపై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

కమల్ సెల్వరాజ్ తన పేరు గురించి మాట్లాడుతూ’ కమల గణేషన్ అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. జెమినీ గణేషన్ కూతురు కావడం అనేది నా అదృష్టం. నాన్నగారు 4 షిఫ్ట్ లలో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక నాన్నగారికి ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాన్న చాలా మంచి వ్యక్తి. నాన్నతో కలిసి మేం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరూ మమ్మల్ని ఆయన సిస్టర్స్‌ ఏమో అని అనుకునేవారు. అలానే మహానటి సినిమాలో నాన్న పాత్ర గురించి చూపించిందంతా నిజం కాదు’ అంటూ కమల పేర్కొన్నారు.

‘చాలామంది మా నాన్న ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు, కానీ మా నాన్న ఒక ఓపెన్ బుక్ లాంటి వారు. ఆయన ఏ విషయమూ, ఎవరి దగ్గర దాచరు. నాన్న పెళ్లి కోసం ఎవరినీ బలవంతం చేయలేదు. ఎంతోమంది అమ్మాయిలు నాన్న కోసం ఎదురు చూసేవారు. మహానటి సినిమాలో నాన్నగారి గురించి చూపించిందంతా తప్పు. ఇక సావిత్రి చాలా మంచి వ్యక్తి. నాన్నగారేమో తెలివైన వ్యక్తి. సావిత్రికి పిల్లలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలవడం లేదు’ అని కమల తెలిపారు. ప్రస్తుతం కమల సెల్వరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.