నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్‌ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కు జోడీగా మ‌ల‌యాళ భామ మిర్ణా మీనన్ న‌టించింది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వరంగల్ లో వరుస మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ సీఐ శివకుమార్ పాత్రలో నరేష్ న‌టించాడు. త‌న ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫమెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. అయిటే టాక్ అనుకూలంగా ఉన్నా ఉగ్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అవ్వ‌లేదు.

దీంతో నెల తిర‌క్క ముందే ఈ సినిమాను ఓటీటీలోకి దింపేస్తున్నారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఉగ్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సాలిడ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు తాజాగా అమెజార్ ప్రైమ్ వారు అనౌన్స్ చేశారు. సో.. థియేట‌ర్స్ లో ఉగ్రంను మిస్ అయిన వారు ఓటీటీలోనే జూన్ 2 నుంచి ఎంజాయ్ చేసేయండి.