Bro.. సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్.. తన మేనల్లుడు కలిసిన నటిస్తున్న చిత్రం BRO ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమాకి రీమిక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగా మల్టీ స్టార్లర్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి టాకీపార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన నటీనటుల పైన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

Pawan Kalyan and Sai Dharam Tej's film titled Bro; Motion poster gives  'vintage PK vibes' | PINKVILLA
పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమాలు అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని వార్త వైరల్ గా మారుతోంది.ఇందుకోసం హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన పబ్ సెట్ కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ పాట షూటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ తీసుకుంటారో అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ లేదా దిశా పటానీలను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.వీరిద్దరు ఎవరు డేట్ లో అడ్జస్ట్ అయితే వారిని ఫైనల్ చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాటను ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రో సినిమాలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదల కాబోతోంది.