టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమా ఏది అంటే కచ్చితంగా అందరికీ గుర్తుకువచ్చే సినిమా RRR ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇద్దరూ కూడా నటించడం జరిగింది. ఈ చిత్రంలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా ప్రధాన పాత్రలో పోషించిన రేస్టివెన్సన్ తాజాగా కొన్ని గంటలకు మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 58 సంవత్సరాలు.. అయితే ఈయన మరణ వార్తకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియడం లేదు కానీ. ఈ ఐరిష్ నటుడు తన కెరియర్ లోని ఎన్నో ముఖ్యమైన పాత్రలలో నటించారు.
రేస్టివెన్సన్ RRR లో గవర్నర్ స్కాట్ పాత్రలో నటించారు.రేస్టివెన్సన్ ఎనిమిదేళ్ల వయసులోనే తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ కి వెళ్లిపోయారట. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులో తన నటన వృత్తిని కొనసాగించడానికి లండన్ లో ఒక ఆర్కిటెక్ సంస్థల ఇంటీరియర్ డిజైనర్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగిందట.. ఆ తర్వాతే బ్రిటన్ లో ఓల్డ్ వీక్ థియేటర్ స్కూల్లో యాక్టింగ్ కోసం చేరినట్లు తెలుస్తోంది.
29 సంవత్సరాల వయసులో పట్టుభద్రుడు అయిన కింగ్ ఆర్డర్ చిత్రంతో 2004 లో ఇచ్చారు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈయన అకస్మార్థిక మరణంతో చిత్ర సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.. ట్విట్టర్ వేదికగా RRR చిత్ర బృందం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
What shocking news for all of us on the team! 💔
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
— RRR Movie (@RRRMovie) May 22, 2023