రమాప్రభతో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శరత్ బాబు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా శరత్ బాబు వెండి ధరపై అలరించాడు. దాదాపు 50 ఏళ్లు నటించి మెప్పించిన శరత్ బాబు నేడు అనారోగ్యంతో కన్నుమూసాడు. అయితే ఆయన జీవితంపై ఒక చెరగని మచ్చ పడింది. సీనియర్ నటి రమాప్రభని 1981లో శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి రమాప్రభ శరత్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

 

శరత్ బాబు తనకు ఎంతో అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. వ్యక్తిగత దూషణకి కూడా పాల్పడింది. తన ఆస్తినంతా శరత్ బాబు లాగేసుకున్నాడని వ్యాఖ్యలు చేసింది. అయితే సైలెంట్‌గా ఉంటే తనదే తప్పని అందరూ భావిస్తారనే ఉద్దేశంతో శరత్ బాబు కూడా ఒకానొక సమయంలో తన వెర్షన్ వినిపించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రమాప్రభకి రూ.60 కోట్ల ఆస్తి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. రమాప్రభ చెబుతున్న మాటల్లో అసలు నిజం లేదని ఆయన తెలిపారు.

ఆమె ఆస్తిని తాను కాజేయలేదని, నిజానికి తన ఆస్తినే విక్రయించి రమాప్రభ పేరిట ఒక ప్రాపర్టీని కొన్నానని, ఆమె తమ్ముడి పేరుమీద ఇంకొక ప్రాపర్టీ కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు. 22 ఏళ్ల వయసులో తనకంటే 7 ఏళ్ళు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నానని.. అప్పటికి తనకు పెద్దగా మెచ్యూరిటీ లేదని, అందుకే ఆమెను పెళ్లి చేసుకొని తప్పు చేశానని చెప్పుకొచ్చాడు. తమది అసలు పెళ్ళే కాదని, అది ఒక కలయిక మాత్రమేనని అప్పట్లో శరత్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Share post:

Latest