మణిశర్మను ముంచిన తమన్.. ఏం చేశాడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కంపోజర్స్‌, సింగర్స్ అనగానే మనకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ పేర్లు వినిపిస్తాయి. టాలీవుడ్‌లో ఉన్న టాప్ సంగీత దర్శకులు వీరిద్దరే. ఎంతో మంది కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. కానీ వీళ్ళలా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరు టాప్ సంగీత దర్శకులు ఒకే స్టేజ్‌పై మెరిసి ఆడియన్స్ ని ఖుషి చేసారు. తమన్, డీఎస్పీ ఇద్దరూ కలిసి ఆహా కోసం ఒకే వేదిక మీద కనిపించారు.

ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఒకసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమా కోసం తమన్ కూడా పనిచేశారట. తమన్ సంగీత దర్శకుడు అవ్వకముందు మణిశర్మ టీమ్‌లో ఉండేవాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ఉన్న టీమ్‌లో కలిసి కొన్ని సినిమా పాట కోసం వర్క్ చేసాడట తమన్. ఈ విషయాన్ని స్వయంగా తమ అభిమానులతో పంచుకున్నారు. సంగీత సామాగ్రి మొత్తం తీసుకొని దేవిశ్రీ దగ్గరకు వెళ్ళేవారట తమన్.

అయితే తమన్, దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేస్తున్న విషయం అప్పుడు మణిశర్మకు తెలియదట. ఒకవేళ ఇప్పుడు తెలిసిన కూడా ఏం పర్లేదు అని చెప్తూ ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. అలా వారిద్దరికి సంబంధించిన విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. అలా తమన్ డీఎస్పీ టీమ్‌తో కలిసి బొమ్మరిల్లు, రెడీ, మల్లన్న సినిమాలకు పనిచేశారట. తమన్ సంగీతం అందించిన ‘సామజ వర గమన’ పాట దేవిశ్రీ కి చాలా ఇష్టమట. అలానే డీఎస్పీ సంగీతం అందించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలోని పాటలన్ని తనకి ఇష్టమని తమన్ తెలిపారు.

Share post:

Latest