శరత్ బాబు చిత్రంలో చిరంజీవి విలన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసినదే.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సిని ప్రముఖుల సైతం శోకసముద్రంలోకి మునిగిపోయారు. శరత్ బాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తూ పలువురు సెలబ్రిటీలు సైతం పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారు. మొదట రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన శరత్ బాబు ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించారు.

47 ROJULU | TELUGU FULL MOVIE | CHIRANJEEVI | JAYA PRADA | SARATH BABU | V9  VIDEOS - YouTube
శరత్ బాబు కెరియర్లు హీరో గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించారు. ఇదంతా ఇలా ఉండగా శరత్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో చిరంజీవి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. శరత్ బాబు హీరోగా నటించిన సినిమాలో చిరంజీవి సైడ్ క్యారెక్టర్స్ మరియు నెగటివ్ క్యారెక్టర్ లో కూడా నటించారట. ఆ చిత్రమే 47 రోజులు..

డైరెక్టర్ కే బాలచందర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా జయప్రద హీరోయిన్గా ఈ చిత్రంలో నటించిన ఈ సినిమా తమిళంలో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో శరత్ బాబుకి ఎంత పేరు వచ్చిందో చిరంజీవికి కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అయితే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. శరత్ బాబు చివరిసారిగా కనిపించిన చిత్రం వకీల్ సాబ్ ఈ సినిమాలో బారు కౌన్సిలర్ చీఫ్ గా కనిపించారు.. శరత్ బాబు మరణ వార్త విని అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Share post:

Latest