ఇండ‌స్ట్రీలో తీవ్ర‌ విషాదం… స్టార్ హీరో తండ్రి క‌న్నుమూత‌..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా ఈరోజు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తన తుది శ్వాస విడిచారు. వీ ఖురానా మరణంతో బాలీవుడ్‌లో ఒక‌సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

आयुष्मान खुराना के पिता का निधन, 2 दिन से हॉस्पिटल में थे एडमिट

ఈ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ ఖురానా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా విషయానికొస్తే.. ముందుగా ఎంటీవీ వీడియో జాకీగా పనిచేసిన ఈయన ‘విక్కీ డోనర్’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినఇచ్చాడు.

आयुष्मान खुराना के पिता का निधन | ayushmann khurrana father pandit p  khurana passes away - India TV Hindi

నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ‘అంధాదున్’ లోని నటనకు గాను విక్కీ కౌశల్‌తో కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఈయన తమ్ముడు అపర్ శక్తి ఖురానా కూడా నటుడే. ఈయన రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘జూబ్లీ’ వెబ్ సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

Share post:

Latest