విజయ్ ఆంటోనీ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు అంటే చాలా మందికి ఇష్టం. ఇక బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. దీని తర్వాత చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ఆ తరహా సక్సెస్ దక్కలేదు. తాజాగా బిచ్చగాడు-2 సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. మరి ఈ సినిమా బిచ్చగాడు కంటే ప్రేక్షకులను అలరించిందా? మరో హిట్ విజయ్ ఆంటోనీ ఖాతాలో పడనుందా? దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.
బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇది ప్రేక్షకులను హృదయాలను చెమ్మగిల్లేలా చేసింది. ఇక బిచ్చగాడు 2 ఇప్పటికే అమెరికాలో విడుదల అయింది. అక్కడి ప్రీమియర్ షోను బట్టి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. కథలోకి వెళ్తే విజయ్ ఆంటోని ఇండియాలోనే అత్యంత ధనవంతులలో ఒకడు. అయితే అతడికి వ్యతిరేకంగా అతడి సన్నిహితులే పని చేస్తుంటారు. అతడిని నాశనం చేసేందుకు కుట్రలు చేస్తుంటారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇదే తరహాలో ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్ ఆఫ్ ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠను పంచుతాయి. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంటుంది. సెకండాఫ్ వచ్చేసరికి ప్రేక్షకులకు కొంత బోర్ కొడుతుంది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా హీరో ఆస్తులు అమ్మేసి పేదలను ఆదుకోవాలని భావిస్తాడు. ఈ తరహా సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసిన అనుభవం ప్రేక్షకులకు ఉంటుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. బిచ్చగాడులో మదర్ సెంటిమెంట్ ఉండగా, ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు సైన్స్ కలిసి కథను రూపొందించారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా చాలా డీసెంట్‌గా ఉందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు.