అతి చేసిన త‌మ‌న్నా.. ఇప్పుడు తిక్క కుదిరిందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా లేటు వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో భోళా శంకర్, జైలర్ వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ వద్దకు ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. శ్రీ‌లీల కీలక పాత్రను పోషిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ద‌ర‌సా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ కోసం రీసెంట్ గా మేక‌ర్స్ త‌మ‌న్నాను సంప్రదించగా.. ఆమె ఏకంగా రూ. కోటిన్నర రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

త‌మ‌న్నా డిమాండ్ కు ఖంగుతిన్న మేకర్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగారట. కానీ అందుకు తమన్నా ఒప్పుకోలేదట. దాంతో త‌మ‌న్నాను కాద‌ని బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌ను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసి రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అతి చేసిన‌ త‌మ‌న్నాకు ఇప్పుడు తిక్క బాగా కుదిరింద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest