40 ఏళ్ల వయసులో ఆ సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన బిగ్ రిస్క్ ఇదే…!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ, టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్‌.

Opinion: 100 Years Of NTR Is Not Just For One Community

నటరత్న ఎన్టీఆర్ తన కెరీర్లు ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు.. వాటిలో రామాయణం, మహాభారతంలోని పలు ఘట్టాలకు సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి. కృష్ణ, అర్జున, దుర్యోధన, కర్ణ, రామ, రావణ.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలని పోషించి మెప్పించారు. అప్పట్లో డ్యాన్సులు అంటే సాధారణంగానే ఉండేవి. క్లాసిక్ డ్యాన్స్ లకు పాట‌ల‌ను ని బట్టి కొంచెం కొత్తగా ట్రై చేసేవారు. క్లాసికల్ డ్యాన్సులు, నాట్యాలు తప్ప అప్పటి సినిమాల్లో డ్యాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాదు.

NTR 96th Birth Anniversary: Phenomenal Celluloid Achievements of the Telugu Demigod | Telugu Movie News - Times of India

ఎన్టీఆర్ కూడా త‌న సినిమాలో డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఏమి తీసుకోనేవ‌రు కాద‌ట‌. సినిమా షూటింగ్‌ సమయంలో డాస్స్‌ మాస్టర్లు చెప్పింది అప్పటికప్పుడు నేర్చుకొని చేసేవార‌ట‌. కానీ అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ ఓ సినిమా కోసం త‌న 40 ఏళ్ళ వ‌య‌సులో కూచిపూడి నృత్యం నేర్చుకున్నారంటే మీరు నమ్మగలరా ? 1963లో మహాభారతంలోని విరాటపర్వం ఘట్టాన్ని నర్తనశాల పేరుతో ఎన్టీఆర్ సినిమాగా తీశారు.

Watch Nartanasala movie - starring NTR and Savitri as Lead Roles on ETV Win | Download ETV Win on Play Store

ఇక అందులో వనవాసంలో పాండవులు ఒక సంవత్సరం వివిధ వేషాల్లో అజ్ఞాతంగా బతకాల్సి వస్తుంది. ఆ ఘట్టమే నర్తనశాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా నటించారు. విరాటరాజు కొలువులో నాట్యం నేర్పించే పాత్రలో బృహన్నలగా ఎన్టీఆర్ నటించారు. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ తన 40 ఏళ్ల వయసులో కూచిపూడి నాట్యంలోనే అగ్ర డాన్సర్ అయిన వెంపటి చిన సత్యం దగ్గర ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు.

ఈ సినిమాలో బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ ఎంతో ఒదిగిపోయారు. కేవలం ఈ ఒక్క సినిమా కోసం ఎన్టీఆర్ తన 40 ఏళ్ల వయసులో కూచిపూడి నాట్యం నేర్చుకున్నారంటే ఆయనకు సినిమాల మీద, ఆ పాత్ర మీద ఎంతటి నిబద్ధత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.