ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బ్రో`లో తేజ్ పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అదే `బ్రో`. ద‌ర్శ‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది.

కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో దేవుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, యాక్సిడెంట్ కు గురైన యువ‌కుడిగా తేజ్ క‌నిపించ‌బోతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలై 28న గ్రాండ్ రిలీజ్ కానుంద‌ట‌. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. బ్రో సినిమాలో తేజ్ పాత్ర‌ను ఇద్ద‌రు టాలీవుడ్ హీరోలు మిస్ చేసుకున్నార‌ట‌.

ఈ సినిమాకి ముందు తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై చాలా సీరియ‌స్ అయిన సంగ‌తి విధిత‌మే. అయితే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డినా.. తేజ్ సంపూర్ణ‌గా కోలుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం తీసుకున్నాడు. ఆ టైమ్ లో త్రివిక్రమ్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్, తేజ్ తో తీద్దాం అనుకున్నప్పటికీ.. సాయి ధరమ్ తేజ్ పరిస్థితి చూసి వేరే హీరో ని తీసుకునే ఆలోచనలో ప‌డ్డార‌ట‌. ఈ క్ర‌మంలోనే రామ్ పోతినేని, నితిన్ ల‌ను సంప్ర‌దించాల‌ని అనుకున్నార‌ట‌. వీరిద్ద‌రిలో ఒక‌రిని ఫైన‌ల్ చేద్దామ‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. కానీ, ఈ విష‌యం తెలుసుకున్న తేజ్‌.. అందుకు నో చెప్పాడ‌ట‌. తానే బాబాయ్ తో ఈ సినిమా చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. దాంతో ప‌వ‌న్ కూడా తేజ్ కే మ‌ద్ద‌తు ప‌లికాడ‌ట‌. అలా బ్రో సినిమాను రామ్, నితిన్ లు మిస్ చేసుకున్నారు.

Share post:

Latest