కొడుకు విషయంలో బాలయ్య కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . యంగ్ హీరోస్ కి ధీటుగా పోటీ ఇస్తూ.. వాళ్ళకంటే సరికొత్త రేంజ్ లో కంటెంట్ ని చూస్ చేసుకుని అంతకు డబల్ స్పీడులో సినిమాలను తెరకెక్కించి రిలీజ్ చేస్తున్న బాలయ్య రీసెంట్ గానే వీరసింహారెడ్డి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు . త్వరలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు .

ఈ క్రమంలోనే చకచక షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే నందమూరి బాలయ్య వారసుడిగా నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే న్యూస్ ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటున్నారు తప్పిస్తే ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య . ఈ క్రమంలోనే బాలయ్య నందమూరి అభిమానులకు మరోసారి నిరాశ మిగిల్చాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

నిజానికి జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ బోయపాటి దర్శకత్వంలో ఆయన నటించబోయే సినిమాకి అఫీషియల్ గానే అప్డేట్ రిలీహ్ చేద్దామనుకున్నారట . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ జాతకం బాగోలేదని.. ఈ సంవత్సరం కాదు పై సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే ఇండస్ట్రిని ఏలేసే రారాజు అవుతాడు అని ఆయన నమ్మిన జ్యోతిష్కుడు చెప్పారట . ఈ క్రమంలోనే బాలయ్య .. బోయపాటి సినిమాలో కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకున్న ఆశను వదులుకునేసారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు . ఈ క్రమంలోనే బాలయ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest