తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలు తనకంటూ సెపరేట్ క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ సమంత పొజిషన్ ప్రెసెంట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భర్తతో విడాకులు తీసుకున్నప్పటినుంచి హీరోయిన్ సమంతకి సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత ఎంతో భారీ అంచనాలతో నటించే తెరకెక్కి రిలీజ్ అయిన “శాకుంతలం” సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను మరింత రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు .
అయితే మొదటి నుంచి అలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన లైఫ్ తనది అంటూ ముందుకు దూసుకెళ్తుంది . కాగా సమంత ప్రెసెంట్ తెలుగులో చేస్తున్న ఒకే ఒక్క సినిమా “ఖుషి”. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇది కాకుండా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిరీస్ “సిటాడిల్” వెబ్ సిరీస్ లో నటిస్తుంది . ఈ రెండు తప్పిస్తే సమంత ఖాతాలో ఏ సినిమా లేదు . కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తెలుగులో మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది.
అంతేకాదు ఇదికూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమాకూడా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగానే తెరకెక్కుతుందట. అంతేకాదు ఈ సినిమాలో సమంతకి హీరోగా ఎవరు నటించరట . అంతేకాదు ఈ సినిమాని రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారట . ఈ సినిమాని తెరకెక్కించేది మరెవరో కాదు నందిని రెడ్డి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి నందిని రెడ్డి సమంతా విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నందినీ రెడ్డి డైరెక్షన్లో మరో లేడీ ఓరియంటెడ్ ఫిలింకు సైన్ చేసింది సమంత అంటూ న్యూస్ వైరల్ అవుతుంది ..!!