శ్రీకాంత్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధం ఏంటి..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటున్నారు. అలా కలిసి అన్యోన్యంగా ఉన్న జంటల్లో శ్రీకాంత్- ఊహ జంట కూడా ఒకటి. శ్రీకాంత్‌ తెలుగులో వరుస‌ సినిమాలు చేస్తున్న సమయంలో ఊహ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలా వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ప్రేమించుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది అని అనుకుంటే పొరపాటే.శ్రీకాంత్ ఇంట్లో వీళ్లిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఊహ ఇంట్లో మాత్రం ఇవ్వలేదట.పైగా వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి ఊహకి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారట కుటుంబ సభ్యులు.ఊహ కుటుంబ సబ్యులకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారికి ఇచ్చి పెళ్లి చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదు.

ఇక విష‌యం చిరంజీవికి తెలియ‌డంతో వెంట‌నే చిరు వెళ్లి ఊహ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడారు. అంత పెద్ద స్టార్ వ‌చ్చి శ్రీకాంత్ గురించి చెప్ప‌డంతో ఊహ త‌ల్లిదండ్రులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక అప్ప‌టి నుంచి శ్రీకాంత్ కు చిరంజీవి అంటే చాలా అభిమానం. చిరును ఆయ‌న అన్న‌య్య అనిపిలుస్తుంటాడు. ఇక చిరంజీవి కూడా శ్రీకాంత్ ను త‌మ్ముడిలానే చూసుకుంటాడు.