ప్రభాస్ “ఆదిపురుష్” రన్ టైమ్.. మ‌రి అంత దారుణామా..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా అల‌రించ‌బోతున్నారు.

Adipurush In Theatres 2023 Run Time posters Multiplexes Truth Makar Sankranti Challenge Bollywood Ramayana । Adipurush Run Time: आदिपुरुष की लंबाई जानकर रह जाएंगे हैरान, इतनी देर सिनेमाहॉल में ...

అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌బోతున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3డీ మోష‌న్ క్యాప్చర్ టెక్నాల‌జీతో వ‌చ్చే ఈ సినిమా ఈ సంవ‌త్స‌రం జూన్‌16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందు రానుంది. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు మూడు రోజుల ముందు జూన్ 13, 2023న ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. `ఆదిపురుష్‌`కు మేక‌ర్స్ షాకింగ్ ర‌న్ టైమ్‌ను లాక్ చేశార‌ట‌. ఇంత‌కీ ఎంతో తెలుసా..? 3 గంటల 15 నిమిషాలు అట‌. అంత లెంగ్త్‌ అంటే మామూలు విష‌యం కాదు. ఇంత సమయం ప్రేక్ష‌కుల‌ను థియేటర్ లో ఆపాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. ఎలాంటి బోరింగ్ స‌న్నివేశాలు ఉండ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. మ‌రి ప్ర‌భాస్ అన్ని గంట‌లు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ లో ఆప‌గ‌ల‌డా..? లేదా..? అన్న‌ది వెచ్చి చూడాలి.