త్రివిక్ర‌మ్ కు అంత పెద్ద కొడుకులా.. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌డు. న‌టుడు కావాల‌ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌.. ర‌చ‌యితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ గా మారి.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు.

 

త్రివిక్ర‌మ్ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోద‌రుడి కూతురు. సౌజ‌న్య ఒక గొప్ప నాట్యకళాకారిని. అలాగే ఇటీవ‌ల‌ ‘సార్‌’ సినిమాతో నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఇక త్రివిక్ర‌మ్‌, సౌజ‌న్య దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వాళ్లు స్కూలుకి వెళ్లే పిల్ల‌లు అయితే కాదండోయ్‌.

పెద్ద కొడుకు పేరు మనోజ్‌ రిషి, చిన్న కొడుకు పేరు నీరజ్‌ నందన్‌. మనోజ్‌ బీబీఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. నీరజ్‌ ఇంటర్మీడియట్‌. మ‌నోజ్‌ అచ్చంగా వాళ్ల నాన్న పోలికే అట‌. సినిమాలంటే చాలా ఆసక్తి అట‌. ఏ సీన్‌ ఎలా తీశారు? ఏ లెన్స్‌ వాడారు? కలర్‌ కరెక్షన్స్‌ ఇలా టెక్నికల్‌ విషయాలన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుచుకుండాట‌. ఇక చిన్న అబ్బాయికి ఫిజిక్స్‌ అంటే ఆసక్తి అట‌. అయితే త్రివిక్ర‌మ్ కొడుకు ఎలా ఉంటారు అన్న‌ది ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. త్రివిక్ర‌మ్ సినిమా ఈవెంట్స్ లోనూ వాళ్లు క‌నిపించిన సంద‌ర్భాలు లేవు.