టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. నటుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్.. రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు. త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కూతురు. సౌజన్య ఒక గొప్ప నాట్యకళాకారిని. […]