త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అవుతున్న ఇప్పటికే ఆ సినిమాలోని నాటు నాటు ఫ్లేవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ పాట రాసిన చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ, వీరిపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఈ పాట ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఇక తాజాగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా ఈ పాటకు అందాల భామ రష్మిక, తమన్నా స్టెప్పలేసి అదరగొట్టారు. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులను ఒక్కసారిగా మైమరిపించారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన స్టార్ ప్లేయర్ తో కూడా ఈ పాటకు స్టెప్పులు వేయించారు. దీంతో నాటు నాటు పాట ఐపీఎల్ ని మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు.
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నటలు సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు ఆ వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ఇప్పట్లో తగ్గదని వ్యాఖ్యానిస్తున్నారు.. నాటు నాటు పాట మరి కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కూడా ఊపేస్తుందని జోస్యం చెబుతున్నారు.
View this post on Instagram