సమంత పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని అ తర్వాత అనుకోని కారణాలతో విడాకులు తీసుకుని ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత మయాసైటిస్ అనే వ్యాధి బారినబడి దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తన వరుస సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతుంది.
ఈ సమయంలోనే ఆమెకు దొరికిన ఏ చిన్న సమయాన్ని కూడా అసలు దుర్వినియోగం చేయకుండా ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వెళితే సమంత నటించిన శాకుంతలం సినిమా 3dలో రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా జరిగిన శాకుంతలం టైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు. ఆ సమయంలో సమంత ముంబైలో ఉండటం వల్ల హీరోయిన్ లేకుండానే ఆ ఈవెంట్ జరిగింది.
ఇప్పుడు ప్రస్తుతం సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది. అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ పాటు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చే ఖుషి సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత కొంచెం సమయం దొరికిన కూడా దాన్ని ఉపయోగించుకుంటుంది. ఇక ఇందులో భాగంగా తాజాగా సమంత కారులో వెళుతుండగానే తన ఫేస్ కి ఫేస్ మాస్క్ వేసుకుంది.
ప్రస్తుతం సమంత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతే కాకుండా మరోవైపు మొహం మీద ఫేస్ మాస్క్ వేసుకొని అలాగే చేతిలో జపమాల పట్టుకొని ధ్యానం చేస్తూ కనిపించింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత తనకు వచ్చిన ఏ చిన్న సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోవటం లేదు అంటూ కామెంట్లు వస్తున్నాయి. మరి కొంతమందేమో కారులో ఉన్నా కూడా అదే ధ్యాసా అంటూ కామెంట్లు చేస్తున్నారు.