వీడియో: అందరిముందే ప్రియాంక చోప్రాను ముద్దు పెట్టుకున్న స్టార్ హీరో..!!

ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక బాలీవుడ్ సెలబ్రిటీల పర్ఫామెన్స్ లతో సూపర్ హిట్ అయింది. ఈ 2-డే ఈవెంట్‌కి దాదాపు బాలీవుడ్ యాక్టర్స్‌ అందరూ విచ్చేసారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ ఈవెంట్‌కి హాజరైంది. కాగా ఇదే ఈవెంట్‌లో బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రియాంక చోప్రా డ్యాన్స్ చేసింది. వీరి కాంబోలో 2015లో “దిల్ ధడక్నే దోలోని” మూవీ వచ్చింది. ఇందులోని పాట అయిన “గల్లన్ గూడియాన్” ఈ బాలీవుడ్ స్టార్స్‌ కలిసి స్టెప్పులు వేశారు.

ఈవెంట్ స్టేజ్‌పై ఈ పాటకు వారు సూపర్ ఎనర్జీతో కాలు కదిపారు. ఈ వీడియో ని ఒక అభిమాని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రణ్‌వీర్, ప్రియాంక చేయి పట్టుకొని స్టేజ్ పైకి రావడానికి సహాయం చేసాడు. ఇద్దరూ స్టేజ్ పై డాన్స్ వేసారు. ఆ తరువాత రణ్‌వీర్, ప్రియాంక భూజం పై చేయి వేసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. స్టేజ్ పై రణవీర్, ప్రియాంక చోప్రా ఇద్దరు కౌగిలించుకున్నారు. అదే సమయంలో ప్రియాంక భర్త – సింగర్ నిక్ జోనస్ అక్కడే ఉన్నాడు. అయినా కూడా రణ్‌వీర్ ఏమాత్రం భయపడకుండా ప్రియాంక బుగ్గపై ముద్దు పెట్టాడు. పైగా అతడు తమ వైపు చూడాలంటూ సైగలు చేస్తూ ఆమెతో రొమాన్స్ చేశాడు.

అయితే ఈ ఇరువురి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి పబ్లిక్ రొమాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. మళ్లీ వీరు కాంబోలో ఒక మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే రణ్‌వీర్ సింగ్ యాష్ కలర్ షర్ట్ వేసుకొని దానిపై మెరుపుల జాకెట్, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించాడు. ప్రియాంక చోప్రా తొడ అందాలను చూపించేలా మల్టీ కలర్ డ్రెస్ ధరించింది. ఇక ప్రియాంక భర్త నిక్ క్లాసిక్ బ్లాక్ సూట్ ని వేసుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)