శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించగా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది.
మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దుమ్ము దుమారం రేపుతోంది. అయితే తొలి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా దసరాను తీర్చిదిద్దాడని.. స్టార్ నటీనటులను బాగా హ్యాండిల్ చేశాడని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. శ్రీకాంత్ ఓదెలను ఓ బంపర్ ఆఫర్ వరించింది. ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే అద్భుత అవకాశాన్ని శ్రీకాంత్ అందుకున్నాడట. దసరా సినిమా చూశాకా శ్రీకాంత్ పనితనానికి ఫిదా అయిన మహేష్ బాబు.. స్వయంగా తన కోసం ఓ కథను సిద్ధం చేయమని చెప్పాడని టాక్ నడుస్తోంది. ఇకవేళ ఇదే నిజమే శ్రీకాంత్ దశ తిరగడం ఖాయమని అంటున్నారు.