యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అర డజన్‌కు పైగా ప్రాజెక్టులతో ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
శ్రీలీల జోరు చూసి స్టార్ హీరోయిన్లు సైతం వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ క్రష్ ఎవరు అని ప్రశ్నించగా.. శ్రీలీల ఆన్సర్ అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. సాధారణంగా హీరోయిన్లను ఫస్ట్ క్రష్ గురించి అడిగితే బాలీవుడ్, హాలీవుడ్ హీరోల పేర్లు చెబుతుంటారు.
కానీ, శ్రీలీల మాత్రం బిగిల్ పేరు చెప్పింది. ఇంతకీ బిగిల్ ఎవరా అని అనుకుంటున్నారా..? ఆమె పెట్ డాగ్. ఈ క్రమంలోనే అభిమాన నటి, నటుడు ఎవరు అని అడిగి.. `నటుల కంటే పాత్రలు, వ్యక్తిత్వాలను ప్రేమిస్తాను. అందుకే అభిమాన నటుల చిట్టా మారిపోతూ ఉంటారు` అని సమాధానం చెప్పింది. అలాగే బీచ్ లో సేద తీరడం అంటే ఎంతో ఇష్టమని.. ఇటాలియన్, భారతీయ వంటకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతానని తెలిపింది. ఇక ఫిట్‌నెస్ కోసం యోగా, డ్యాన్స్, వ్యాయామాలు, ఆటలు ఆడతానని, జిమ్‌కు వెళ్లడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపనని తెలిపింది. తాను హాకీ క్రీడాకారిణిని అని ఈ సందర్భంగా శ్రీలీల పేర్కొంది.